: రాష్ట్ర ప్రాజెక్టులను అడ్డుకునేందుకు నాగం కేసులు వేస్తున్నారు: హరీశ్‌రావు ఆగ్రహం
రాష్ట్ర ప్రాజెక్టులను అడ్డుకునేందుకు బీజేపీ తెలంగాణ నేత నాగం జనార్దన్ రెడ్డి కేసులు వేస్తున్నారని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా నాగిరెడ్డి పల్లిలో ఈరోజు నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ఎన్ని ఆటంకాలు సృష్టించినా పాలమూరు ఎత్తిపోతలను పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారని, అది చేసి చూపిస్తామని పేర్కొన్నారు. మరోవైపు ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కాంగ్రెస్ కుట్రలు పన్నుతోందని, రైతులను రెచ్చగొడుతూ భూసేకరణ ఆపాలని చూస్తోందని ఆయన అన్నారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా రైతులకు లక్షల ఎకరాలకు నీరందించడమే లక్ష్యంగా ప్రాజెక్టులు కొనసాగుతాయని ఆయన ఉద్ఘాటించారు.