: అమెరికాలో అభిమానులతో కలిసి 'కబాలి' సినిమా చూసిన రజనీకాంత్
భారతీయ సినీ పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'కబాలి' సినిమాను సూపర్ స్టార్ రజనీకాంత్ అమెరికాలో అభిమానుల మధ్య కూర్చుని వీక్షించారు. సినిమా ప్రదర్శిస్తున్నంతసేపు అభిమానుల హర్షాతిరేకాలను తిలకించిన రజనీకాంత్ సినిమాపై సంతృప్తి వ్యక్తం చేశారు. కాగా, సినిమా బాగుందని అభిమానులు సంబరపడిపోతున్నారు. కాగా, భారతదేశ వ్యాప్తంగా 'కబాలి' రేపు విడుదల కానుంది. ఇప్పటికే ఆదివారం వరకు ఈ సినిమా విడుదలవుతున్న ధియేటర్ల టికెట్లు అమ్ముడైపోయాయి. ఈ నేపథ్యంలో సినిమా బాగుందని అమెరికాలో ఈ సినిమా చూసిన స్నేహితులు చెప్పడంతో కనీసం స్పెషల్ స్క్రీన్లు ఏర్పాటు చేసైనా, లేక హోటళ్లలోనైనా చూద్దామని భావించిన వారికి తమిళ ఫిల్మ్ చాంబర్ షాకిచ్చింది. సినిమాటోగ్రపీ చట్టం ప్రకారం హోటళ్లలో సినిమాను ప్రదర్శించడం నేరమని చెప్పడంతో హోటళ్లు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాయి. దీంతో పలువురు అభిమానులు నిరాశ చెందుతున్నారు.