: ‘కబాలి’తో నా కల నెరవేరింది: ఆ చిత్రం ఎడిటర్, తెలుగు యువకుడు ప్రవీణ్


తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి పనిచేయాలన్న తన కల నెరవేరిందని ‘కబాలి’ చిత్రానికి ఎడిటర్ గా పనిచేసిన తెలుగు యువకుడు కేఎల్ ప్రవీణ్ పేర్కొన్నారు. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘రజనీకాంత్ గారితో ఫొటో దిగడమనేదే పెద్ద కల. అట్లాంటిది ఆయనతో కలిసి పనిచేసే అవకాశం రావడం చాలా అదృష్టం. ఈ అవకాశం వస్తుందని కూడా అనుకోలేదు. నేను చిన్నప్పటి నుంచి రజనీకాంత్ అభిమాని. ఆయన సినిమా రిలీజ్ అయినప్పుడు థియేటర్ల వద్దకు వెళ్లి పాలాభిషేకాలు చేశాను. ఇప్పుడు ఆయన సినిమాకు ఎడిటర్ గా పనిచేయడంలో ఉన్న ఆనందం వేరు.. మాటల్లో చెప్పలేను. కానీ, ‘కబాలి’ కి పనిచేసిన కొత్త టీమ్ ఎలా చేసిందనే ఉత్సుకత అభిమానుల్లో ఉంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్, టీజర్, పోస్టర్లు అందరికీ నచ్చాయి. అదేబాటలో సినిమా కూడా నడుస్తుంది. ‘కబాలి’ తమిళ్, తెలుగు వెర్షన్లు రెండూ చాలా ఎగ్జయిటింగ్ గా ఉన్నాయి. తెలుగులో రజనీకాంత్ గారికి మనో డబ్బింగ్ అద్భుతంగా ఉంది. ఈ సినిమా స్క్రిప్ట్ చదివి సినిమా ఎలా ఉండాలనుకున్నామో, అదేవిధంగా ఈ సినిమా వచ్చింది. సూపర్ స్టార్ రజనీ అభిమానులను సంతృప్తి పరచడం ఒక సవాల్. ఈ చిత్రానికైనా హైప్ ఉంటుందని తెలుసు. కానీ, ఇంత హైప్ ఉంటుందనుకోలేదు’ అని చెప్పిన ప్రవీణ్, తెలుగు చిత్రాలకు కూడా ఎడిటర్ గా చేయాలని ఉందని తన మనసులో మాట బయటపెట్టారు.

  • Loading...

More Telugu News