: హైటెక్ సిటీ ప్రాంతంలో పైలెట్ ప్రాజెక్టు.. సిస్కో సిస్టమ్స్‌తో కుదిరిన ఒప్పందం


ప్ర‌సిద్ధ‌ సిస్కో సిస్టమ్స్‌తో తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణలో స్మార్ట్ సిటీస్ ప్లాన్ అమలులో భాగంగా ఈ ఒప్పందం జరిగింది. తెలంగాణ ఐటీ శాఖ‌మంత్రి కె.టి. రామారావు సమక్షంలో ఈమేరకు హైదరాబాద్‌లో ఎంవోయూపై సిస్కో ప్రతినిధులు, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి సంతకాలు చేసుకున్నారు. హైద‌రాబాద్‌ను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సిస్కో సిస్టమ్స్ ద్వారా సర్వీసు అందనుంది. హైద‌రాబాద్‌ హైటెక్ సిటీకి స‌మీపంలో పైలెట్ ప్రాజెక్టు పనులు ప్రారంభం కానున్నాయి. స్మార్ట్ వైఫై, స్మార్ట్ పార్కింగ్, స్మార్ట్ ట్రాన్స్‌పోర్ట్, స్మార్ట్ లైటింగ్ కోసం సిస్కో సిస్టమ్స్ ప‌నిచేయ‌నుంది.

  • Loading...

More Telugu News