: పోలవరం ప్రాజెక్టుకు నిధుల సమస్య లేనేలేదు: కేంద్ర‌మంత్రి ఉమాభార‌తి


కేంద్ర ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు నిన్న ఇచ్చిన ఆదేశాల‌పై కేంద్ర‌మంత్రి ఉమాభార‌తి సానుకూలంగా స్పందించారు. పోల‌వ‌రం జాతీయ ప్రాజెక్టు అనీ, దాన్ని తామే నిర్మిస్తామ‌ని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు నిధుల స‌మ‌స్య లేనేలేద‌ని ఆమె స్ప‌ష్టం చేశారు. పోల‌వ‌రం ప్రాజెక్టుని తాము అనుకున్న గడువులోనే నిర్మించి తీరుతామ‌ని పేర్కొన్నారు. దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం ఆదేశించిన మేర‌కు అపెక్స్‌ కౌన్సిల్ స‌మావేశం ఏర్పాటు చేసి, అధికారుల‌తో భేటీ అవుతామ‌ని, దీనికి సంబంధించిన తేదీల‌ను త్వరలో ప్ర‌క‌టిస్తామ‌ని ఆమె తెలిపారు.

  • Loading...

More Telugu News