: ప్రత్యూష ఆత్మహత్యకు ప్రియుడే కారణం!... రాహుల్ పై అభియోగం మోపిన ముంబై పోలీసులు!


దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన టెలీ సీరియల్ ‘బాలికా వధు’ నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్యకు గల కారణాలను ముంబై పోలీసులు దాదాపుగా నిర్ధారించారు. ప్రియుడు రాహుల్ రాజ్ సింగే ఆమెను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాడని పోలీసులు అభియోగాలు మోపారు. ఈ మేరకు ఈ కేసును విచారిస్తున్న కోర్టులో పోలీసులు 101 పేజీల చార్జిషీటును దాఖలు చేశారు. ప్రత్యూషను ఆత్మహత్యకు ప్రేరేపించడంతో పాటు ఆమెపై హింసకు పాల్పడినట్లుగా కూడా రాహుల్ పై పోలీసులు అభియోగాలు మోపారు. ప్రత్యూష ఆత్మహత్య అనంతరం యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్న రాహుల్ బయటే ఉన్నాడు. పోలీసులు చార్జిషీటు దాఖలు చేసిన నేపథ్యంలో ఈ నెల 30న అతడు కోర్టు ముందు హాజరుకానున్నాడు.

  • Loading...

More Telugu News