: బుద్ధిగా బ‌ర్గ‌ర్లు తింటూ అమాయ‌కుడిలా చూస్తోన్న‌ టీమిండియా స్టార్ క్రికెట‌ర్ చిన్ననాటి ఫోటో ఇది!


ఈ చిన్నోడు ఇప్పుడు క్రికెట్ రంగంలో ఓ స్టార్‌. తాను డైనింగ్ టేబుల్‌పై కూర్చొని బ‌ర్గ‌ర్లను ఎంతో ఇష్టంగా తింటుండ‌గా త‌న చిన్న‌నాడు తీసిన ఫోటోను టీమిండియా స్టార్ క్రికెట‌ర్ తాజాగా త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా త‌న అభిమానుల‌తో పంచుకున్నాడు. ఎంతో అమాయ‌కుడిలా, బుద్ధిగా కెమెరా వంక చూస్తోన్న ఈ చిన్నోడిని ఇప్పుడు భార‌త క్రికెటర్ల‌తో పాటు ప్ర‌పంచ క్రికెటర్లు స‌చిన్ టెండూల్క‌ర్‌తో పోలుస్తున్నారు. మైదానంలో అడుగు పెట్టాడంటే ప‌రుగుల వ‌ర‌ద పారాల్సిందే. గుర్తుప‌ట్టారా? ఇత‌డే మ‌న స్టైలిస్ట్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ అండీ. త‌న చిన్న‌నాటి ఫోటోను కోహ్లీ తాజాగా త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. బర్గర్లు తింటూ అలా బొద్దుగా, ముద్దుగా తయారయ్యానని కోహ్లీ పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News