: అరకు ఎంపీ ఎస్టీనే!... కొత్తపల్లి గీతను వాల్మీకిగా తేల్చేసిన ‘తూర్పు’ జాయింట్ కలెక్టర్!


విశాఖ జిల్లా అరకు పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీత కులంపై నెలకొన్న వివాదం ముగిసింది. కొత్తపల్లి గీత ఎస్టీ రిజర్వేషన్ కేటగిరీలోని వాల్మీకి సామాజిక వర్గానికి చెందినవారుగా తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీ తేల్చేసింది. గడచిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా ఎస్టీ రిజర్వడ్ అరకు లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసిన కొత్తపల్లి గీత విజయం సాధించారు. అయితే ఆమె ఎస్టీ కాదని, బీసీ సామాజిక వర్గానికి చెందిన వారన్న వివాదం రేగింది. తన కులంపై వివాదం రేగిన తరుణంలో ఆమె వైసీపీకి దూరంగా జరిగారు. అధికార పార్టీ టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఆ పార్టీలో చేరతారనే ఊహగానాలకు తెర తీశారు. అయితే ఇప్పటికీ ఆమె వైసీపీ ఎంపీగానే ఉంటూ టీడీపీకి మద్దతిస్తున్న ఎంపీగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో గీత కులంపై విచారణ కోసం ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల కమిటీ... తన విచారణను ముగించింది. కొత్తపల్లి గీతను వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన మహిళగా గుర్తించిన కమిటీ... ఆమె ఎస్టీ వర్గానికి చెందినవారుగానే తేల్చేసింది. ఈ మేరకు నివేదికను కమిటీ త్వరలోనే కోర్టుకు సమర్పించనుంది. ఈ నివేదికను పరిశీలించిన తర్వాత కోర్టు కూడా కొత్తపల్లి గీతను ఎస్టీగానే ప్రకటిస్తే ఇక ఈ వివాదం సద్దుమణిగినట్టేనన్న వాదన వినిపిస్తోంది.

  • Loading...

More Telugu News