: ప్రొ.కోదండరాం ఆధ్వర్యంలో గన్‌పార్క్ నుంచి యాత్ర ప్రారంభం
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులపై రైతులు, ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో వాటిని సమగ్రంగా అధ్యయనం చేయడానికి టీజేఏసీ ఛైర్మన్ ప్రొ.కోదండరాం ఆధ్వర్యంలో నేటి నుంచి చేయాలని తలపెట్టిన అధ్యయన యాత్ర ప్రారంభమయింది. హైదరాబాద్‌లోని అసెంబ్లీ సమీపంలో ఉన్న గన్‌పార్క్ నుంచి కోదండరాం ‘అధ్యయన యాత్ర’ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాజెక్టులపై చర్చ జరగాలని అన్నారు. భూనిర్వాసితులకు పరిహారం, ముంపు బాధితుల కష్టాలపై ఆరా తీయాల్సి ఉందని ప్రొ.కోదండరాం చెప్పారు. ప్రస్తుతం పాలమూరు ప్రాజెక్టుల కోసం అధ్యయనం చేయడానికే యాత్రని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు తాగునీరు ఇవ్వడానికి ప్రభుత్వం కృషి చేయాలని ఆయన సూచించారు.