: హాస్టల్లో మంటలు!... బయటకు పరుగులు పెట్టిన విద్యార్థులు!
హైదరాబాదులోని కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ(కేపీహెచ్ బీ)లో నేటి ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల నుంచి హైదరాబాదులో విద్యాభ్యాసం కోసం వస్తున్న విద్యార్థుల వసతి కోసం ఏర్పాటైన మేఘన హాస్టల్ లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో అగ్ని కీలలు వేగంగా విస్తరించాయి. పొద్దున్నే నిద్ర లేచి తరగతులకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న విద్యార్థులు శరవేగంగా విస్తరిస్తున్న మంటలను చూసి బెంబేలెత్తిపోయారు. ప్రాణాలు దక్కించుకునేందుకు బయటకు పరుగులు తీశారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఏ ఒక్క విద్యార్థికి కూడా గాయాలు కాలేదు.