: 'హ్యాట్రిక్ సిరీస్'పై కన్నేసిన కోహ్లీ సేన!... నేటి నుంచే వెస్టిండీస్ తో తొలి టెస్ట్!


వెస్టిండీస్ టూర్ కు వెళ్లిన టీమిండియా నేటి నుంచి టెస్టు సిరీస్ ను ప్రారంభించనుంది. టీమిండియా స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ నేతృత్వంలో విండీస్ గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా జట్టు అక్కడి అంటిగ్వా నగరంలో కరీబియన్ జట్టుతో నేటి నుంచి తొలి టెస్టును ఆడనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ లో టీమిండియానే హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగనుంది. ఇప్పటికే వరుసగా రెండు పర్యాయాలు కరీబియన్ గడ్డపై టెస్టు సిరీస్ లను నెగ్గిన టీమిండియా... ఈ దఫా కూడా సిరీస్ నెగ్గితే హ్యాట్రిక్ సిరీస్ సాధించినట్లవుతుంది. ఈ క్రమంలో హ్యాట్రిక్ విజయం దిశగా కోహ్లీ సేన ప్రత్యేకంగా దృష్టి సారించింది. మొత్తం నాలుగు టెస్టు మ్యాచ్ లు ఈ సిరీస్ లో ఉన్నాయి.

  • Loading...

More Telugu News