: కాపు విద్యార్థులు విదేశాల్లో చదువుకోవాలన్నదే నా ఆశ: చంద్రబాబు


కాపు విద్యార్థులు విదేశాల్లో మంచి విద్య అందుకోవాలన్నదే తన ఆశ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. విజయవాడలో 'విదేశీ విద్యా దీవెన' పథకానికి అర్హత సాధించిన 145 మంది కాపు విద్యార్థులతో సమావేశమైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 400 మంది కాపు విద్యార్థులు విదేశాల్లో విద్యనభ్యసించేందుకు రుణసాయం చేస్తున్నామని చెప్పారు. ప్రతి విద్యార్థికి 10 లక్షల రూపాయల సాయం అందుతుందని ఆయన చెప్పారు. వచ్చే నెలాఖరుకల్లా ఎంపిక ప్రక్రియ పూర్తవుతుందని ఆయన తెలిపారు. మంచి విద్యనభ్యసించి ఉన్నత పౌరులుగా రూపుదిద్దుకోవాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News