: సల్మాన్... ‘సుల్తాన్’ సూపర్, కంగ్రాట్స్: హీరో వెంకటేష్
సల్మాన్ ఖాన్ ‘సుల్తాన్’ చిత్రం సూపర్ గా ఉందని.. సల్మాన్ నటన అద్భుతమని, సినిమా బ్రహ్మాండంగా ఉందంటూ హీరో విక్టరీ వెంకటేష్ అన్నాడు. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో ఒక పోస్ట్ చేశాడు. గతంలో సల్మాన్ తో వెంకటేష్ దిగిన ఒక ఫొటోను కూడా ఆయన పోస్ట్ చేశాడు. అత్యద్భుత నటన ప్రదర్శించిన సల్మాన్ కు ‘కంగ్రాట్స్’ చెబుతున్నానని ఆ ట్వీట్ లో పేర్కొన్నాడు. కాగా, సుల్తాన్ చిత్రం కలెక్షన్లు ఇప్పటికే రూ.500 కోట్లతో దూసుకెళ్తూ రికార్డులు సృష్టిస్తున్న విషయం తెలిసిందే.