: హాలీవుడ్ దర్శకుడు గ్యారీ మార్షల్ కన్నుమూత


హాలీవుడ్ కు చెందిన ప్రముఖ దర్శకుడు గ్యారీ మార్షల్ (81) కన్నుమూశారు. నిమోనియాతో బాధపడుతున్న ఆయన అమెరికా లాస్ ఏంజిల్స్ లోని ఒక ఆసుపత్రిలో నిన్న మృతి చెందారు. ఆయనకు భార్య బార్బరా, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కాగా, గ్యారీ రూపొందించిన సిచ్యువేషనల్ కామెడీ షో ‘హ్యాపీ డేస్’ ఆయనకు ఎంతగానో పేరు తెచ్చిపెట్టింది. 1974 నుంచి 1984 వరకు అమెరికా టీవీ రంగాన్ని ఈ టీవీ షో ఒక ఊపు ఊపింది. ‘న్యూ ఇయర్ ఈవ్’, ‘వాలెంటైన్స్ డే’, ‘ది ప్రిన్సెస్ డైరీస్’, ‘బీచెస్’తో పాటు ఈ ఏడాది విడుదలైన ‘మదర్స్ డే’ చిత్రం వరకు ఎన్నో విజయవంతమైన సినిమాలను ప్రేక్షకులకు అందించారు. వీటితో పాటు నలభై కామెడీ షోలను కూడా ఆయన రూపొందించారు. న్యూయార్క్ లో జన్మించిన గ్యారీ అక్కడే పెరిగారు. జర్నలిజంలో డిగ్రీ పూర్తి చేసిన అనంతరం ఒక పత్రికలో సినీ గాసిప్స్ రాసేవారు. ఈ గాసిప్స్ అద్భుతంగా పండటంతో హాస్య నటుడు జాయ్ బిషఫ్ ఆయన్ని లాస్ ఏంజిల్స్ తీసుకువెళ్లి తన టాక్ షో కు డైలాగ్ రైటర్ గా నియమించుకున్నారు. దీంతో మంచిపేరు సంపాదించుకున్న ఆయన ఇక వెనుదిరిగి చూడలేదు. ది లూసీ, ది డిక్ వాన్ డైక్, హ్యాపీ డేస్ వంటి పలు టీవీ షోలను రూపొందించి తన స్థానాన్ని పదిలపరచుకున్నారు. గ్యారీ మృతిపై హాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు.

  • Loading...

More Telugu News