: ఐటీ డిక్లరేషన్ మంచి పథకం: దర్శకుడు దాసరి నారాయణరావు
ఐటీ డిక్లరేషన్ మంచి పథకమని దర్శకుడు దాసరి నారాయణరావు అన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ మంది ట్యాక్స్ కడుతున్నారని, ట్యాక్స్ కట్టడంపై అందరిలో చైతన్యం తీసుకువస్తామని అన్నారు. సినీ పరిశ్రమలో 80 శాతం మంది అప్పుల్లో ఉన్నారని దాసరి పేర్కొన్నారు. కాగా, ఇదే అంశంపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మూవీ) అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, ట్యాక్స్ చెల్లింపులో మంచి ఫలితాలు సాధించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తామని అన్నారు. కాగా, ఐటీ డిక్లరేషన్ -2016 పథకాన్ని ఇన్ కం ట్యాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ సుశీల్ కుమార్ ప్రారంభించారు. ఇన్ కం ట్యాక్స్ బకాయిపడ్డ వారంతా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, ట్యాక్స్ చెల్లించేవారికి అధికారులు సహకరిస్తారని చెప్పారు. ఇప్పటి వరకు ట్యాక్స్ చెల్లించినవారు 30 శాతం మంది మాత్రమే ఉన్నారని, ఈ పథకం ద్వారా 45 శాతానికి పెరుగుతారని ఆశిస్తున్నామని సుశీల్ కుమార్ పేర్కొన్నారు.