: రాహుల్ కునుకుపై మీడియా అనవసర రాద్ధాంతం చేస్తోంది: రేణుకా చౌదరి
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ లోక్ సభలో చిన్న కునుకు తీస్తున్న సంఘటనకు సంబంధించి మీడియా అనవసర రాద్ధాంతం చేస్తోదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రేణుకా చౌదరి మండిపడ్డారు. ఆయన నిద్ర పోవడం లేదని, కేవలం కళ్లు మూసుకుని మాత్రమే కూర్చున్నారని, ఇందుకు సంబంధించిన రాహుల్ ఫొటోను చూపిస్తున్న మీడియాకు పనీపాటాలేనట్టుందని విమర్శించారు. అయితే, రాహుల్ కునుకుపై కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో నేత ఆస్కార్ ఫెర్నాండెజ్ మాట్లాడుతూ, పేద ప్రజల కోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్న తమ ఉపాధ్యక్షుడికి పార్లమెంట్ లో నిద్ర వచ్చి ఉండవచ్చంటూ సమర్థించుకున్నారు.