: హరితహారంపై సర్కారు రూ.కోట్లు వృథా చేస్తోంది: చాడ వెంకట్‌రెడ్డి
తెలంగాణ ప్రభుత్వ తీరుపై సీపీఐ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. హరితహారంపై సర్కారు రూ.కోట్లు వృథా చేస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంపై సర్కారు శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో జరిగిన భూకబ్జాలపై త్వరలో ఆధారాలు బయటపెడతామని ఆయన అన్నారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాజ్యసభలో కేవీపీ బిల్లుకు మద్దతిస్తామని చెప్పారు. దేశంలో దళితులపై జరుగుతోన్న దాడులకు నిరసనగా అన్ని పార్టీలతో కలిసి పోరాడతామని ఆయన పేర్కొన్నారు. ధరల పెరుగుదల, ఎఫ్‌డీఐలకు వ్యతిరేకంగా ఆగస్టు 17న దేశవ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.