: త్వరలో మార్కెట్ లోకి మోస్ట్ సెక్యూర్డ్ ఎం 6 స్మార్ట్ ఫోన్
జియోనీ మోస్ట్ సెక్యూర్డ్ ఎం 6 స్మార్ట్ ఫోన్ ను త్వరలో మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఈ నెల 26న ఈ ఫోన్ ను ఆవిష్కరించనున్నామన్నారు. సమాచారాన్ని భద్రంగా ఉంచే ఎన్ క్రిప్టెడ్ చిప్ ను ఈ ఫోన్ లో అమర్చామని, కాల్ రికార్డ్స్, ఫొటోలు, డాక్యుమెంట్లు, ఇతర సమాచారం ఏమాత్రం బయటకు పోకుండా ఈ చిప్ రక్షణ కల్పిస్తుందన్నారు. ఆండ్రాయిడ్ వ్యవస్థ హ్యాకింగ్ కు గురైనా ఎం 6 స్మార్ట్ ఫోన్ లోని డేటా సురక్షితంగా ఉంటుందని ‘జియోని’ ప్రతినిధులు తెలిపారు. ‘యాపిల్’ ఫోన్ తో పోలిస్తే తాము విడుదల చేయనున్న ఎం 6 స్మార్ట్ ఫోన్ మరింత భద్రత కలిగి ఉందన్నారు. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ ధర, ఫీచర్ల వివరాలను సంస్థ ప్రతినిధులు వెల్లడించలేదు.