: 22న అంతా అందుబాటులో ఉండాలి...విప్ జారీ చేసిన కాంగ్రెస్


ఏపీకి ప్రత్యేకహోదా బిల్లు రాజ్యసభలో చర్చకు రానుందన్న వార్తల నడుమ కాంగ్రెస్ విప్ జారీ చేసింది. ఈ నెల 22న కేవీపీ రామచంద్రరావు ప్రతిపాదించిన ఏపీ ప్రత్యేకహోదా సవరణల బిల్లు చర్చకు రానుందని, ఈ సందర్భంగా కాంగ్రెస్ కు చెందిన రాజ్యసభ సభ్యులంతా పార్లమెంటు సమావేశాలకు హాజరుకావాలని స్పష్టం చేసింది. మూడు లైన్ల విప్ లో ఏపీకి ప్రత్యేకహోదా కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, అందులో భాగంగా ఈ ప్రైవేటు బిల్లును గెలిపించాల్సిన బాధ్యత తమపై ఉందని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. కాగా, బిల్లు అసలు చర్చకు వచ్చే అవకాశమే లేదంటూ బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. చర్చకు వచ్చినా ఎలాంటి ఉపయోగం లేదని టీడీపీ నేత బొండా ఉమ అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News