: కళ్లజోడు పెట్టుకుని ఉండే వాళ్లతో ఎక్కువసేపు మాట్లాడను: స్వీటీ అనుష్క


కళ్లజోడు పెట్టుకుని ఉండేవాళ్లతో తాను ఎక్కువ సేపు మాట్లాడనని స్వీటీ అనుష్క చెప్పింది. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు వారి కళ్లని, వారి ముఖంలో చిరునవ్వును తాను గమనిస్తుంటానని చెప్పింది. మన కళ్లే మన గురించి చెబుతాయనే విషయాన్ని బాగా నమ్ముతానని, అందుకే, తనతో మాట్లాడే వ్యక్తి కళ్ల జోడు ధరించకుండా ఉంటే ఎంత సేపైనా మాట్లాడతానని, లేకపోతే తక్కువ సమయంలో ముగించేస్తానని అనుష్క చెప్పింది. ఇక తన అందంపై తరచుగా వచ్చే కామెంట్లను ఆమె ప్రస్తావించింది. అందం అంటే కేవలం శరీరాకృతే కాదని ఆరోగ్యంతో పాటు ఆనందం కూడా ఉండాలని చెప్పింది. తన నవ్వు, శరీరాకృతి బాగుంటాయని అందరూ చెబుతుంటారని, ఈ అందమైన రూపం తనకు దేవుడిచ్చిన వరమంటూ అనుష్క మురిసిపోయింది.

  • Loading...

More Telugu News