: రాయపాటి ఇంటికి చంద్రబాబు!... సతీ వియోగం నేపథ్యంలో ఎంపీకి పరామర్శ!


టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు మరికాసేపట్లో పార్టీ సీనియర్ నేత, నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంటికి వెళ్లనున్నారు. అనారోగ్యం కారణంగా ఇటీవలే రాయపాటి సతీమణి లీలా కుమారి మరణించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఢిల్లీ పర్యటనకు బయలుదేరే బిజీలో ఉన్న చంద్రబాబు... రాయపాటికి స్వయంగా ఫోన్ చేసి పరామర్శించారు. తాజాగా ఆయనను ప్రత్యక్షంగా కలిసి పరామర్శించేందుకే చంద్రబాబు... రాయపాటి ఇంటికి వెళుతున్నారు.

  • Loading...

More Telugu News