: హైదరాబాద్ - విజయవాడ మధ్య హైస్పీడ్ రైళ్లకు అవకాశం: లోక్ సభలో సురేష్ ప్రభు
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి, ఏపీ ముఖ్యపట్టణం, కొత్త రాజధాని అమరావతికి అత్యంత సమీపంలోని విజయవాడకు హైస్పీడ్ రైళ్లు నడిపే అవకాశాలున్నాయని కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు పార్లమెంటుకు తెలిపారు. ఇందుకు సంబంధించిన అధ్యయనం పూర్తయిందని అన్నారు. ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలు, నిధులు, భూసేకరణ వంటి అంశాలపై తొలుత దృష్టిని సారిస్తామని, ఆపై ప్రాజెక్టును చేపడతామని అన్నారు. దేశంలోని వివిధ నగరాల మధ్య హైస్పీడ్ రైళ్లపై సభ్యులడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. పలు నగరాల మధ్య వేగవంతమైన రైళ్లు నడిపేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు.