: హఫీజ్ తో మాట్లాడి... చివరి కోరిక తీర్చుకున్న బుర్హాన్ వానీ!


జమ్ము కశ్మీర్ లో పెను కల్లోలానికి కారణమైన హిజ్బుల్ ముజాహిదీన్ నేత బుర్హాన్ వానీకి సంబంధించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ముంబై దాడుల సూత్రధారి, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్... బుర్హాన్ ఎన్ కౌంటర్ కు నిరసనగా ప్రసంగాల వెల్లువను వినిపిస్తున్నాడు. తన తాజా ప్రసంగంలో బుర్హాన్ వానీ తన చివరి కోరికను తీర్చుకుని మరీ చనిపోయాడని అతడు చెప్పాడు. అయినా బుర్హాన్ వానీ అంతిమ కోరిక ఏమిటో తెలుసా? హఫీజ్ సయీద్ తో మాట్లాడటమేనట. చనిపోవడానికి ముందు బుర్హాన్ వానీ కశ్మీర్ నుంచే తనకు ఫోన్ చేసి మాట్లాడాడని సయీద్ వెల్లడించాడు. తద్వారా అంతిమ కోరికను తీర్చుకుని బుర్హాన్ వీర మరణం పొందాడని కూడా సయీద్ పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News