: లోకేష్ ను తెలంగాణకు అంకితం చేయాలన్న టీటీడీపీ... ఇద్దరమూ ఉంటామన్న చంద్రబాబు!
ఏపీ ముఖ్యమంత్రిగా నిత్యమూ శ్రమిస్తున్న చంద్రబాబునాయుడు, తెలంగాణలో పార్టీ తిరిగి పుంజుకునేలా కనీసం తన కుమారుడు, పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్ ను అంకితం చేయాలని తెలంగాణ పార్టీ నేతలు చంద్రబాబును కోరినట్టు తెలుస్తోంది. మోత్కుపల్లి నర్సింహులు, రేవంత్ రెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి, రమేష్ రాథోడ్ తదితరులతో చంద్రబాబు సమావేశమైన వేళ ఈ అంశం చర్చకు వచ్చిందట. రాష్ట్రంలో పార్టీ క్యాడర్ తీవ్ర నిరాశలో ఉందని, వారిలో తిరిగి మానసిక స్థైర్యాన్ని నింపేందుకు లోకేష్ ను హైదరాబాద్ లో ఉంచి, పార్టీ కార్యకలాపాలు అప్పగించాలని నేతలు కోరగా, చంద్రబాబు సున్నితంగానే తిరస్కరించారని పార్టీ వర్గాలు అంటున్నాయి. తెలంగాణకు ఇద్దరమూ సమయం కేటాయిస్తామని, పార్టీ సమస్యలను పరిష్కరిస్తామని మాత్రం హామీ ఇచ్చినట్టు సమాచారం.