: కాశ్మీర్ కు స్వాతంత్ర్యం పేరిట హఫీజ్ సయీద్ భారీ ర్యాలీ


కాశ్మీర్ కు స్వాతంత్ర్యం (కాశ్మీర్ కారవాన్) పేరుతో ముంబై దాడుల సూత్రధారి, టెర్రరిస్టు హఫీజ్ సయీద్ పాకిస్థాన్ లో ఈరోజు భారీ ర్యాలీ చేపట్టాడు. లాహోర్ నుంచి ఇస్లామాబాద్ వరకు 264 కిలోమీటర్ల దూరం ఈ ర్యాలీ సాగనుంది. ఈ ర్యాలీలో జమాత్ ఉల్ దవా కార్యకర్తలు, వందలాది వాహనాల్లో పాక్ రాజధాని వైపు కదిలారు. రేపటికి ఈ ర్యాలీ ఇస్లామాబాద్ చేరుకోనుంది. ఈ సందర్భంగా హఫీజ్ మీడియాతో మాట్లాడుతూ, ఇస్లామాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహించి కాశ్మీర్ విషయంలో పాక్ మంత్రులు, ఇతర నేతలపై మరింత ఒత్తిడి తీసుకువస్తామని అన్నారు.

  • Loading...

More Telugu News