: డొనేషన్స్ కింద ఇకపై ‘షేర్లు’ను స్వీకరిస్తాం: సిద్ధి వినాయక్ టెంపుల్ చైర్మన్
ముంబయిలోని ప్రముఖ ఆలయం సిద్ధి వినాయక్ ట్రస్టు సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇకపై తమకు చెల్లించే డొనేషన్లను షేర్ల రూపంలో కూడా తీసుకుంటామని పేర్కొంది. ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ట్రస్టు చైర్మన్ నరేంద్ర రానే ఈ విషయాన్ని వెల్లడించారు. సిద్ది వినాయక ట్రస్టు తరపున ఎస్బీఐసీఏపీ సెక్యూరిటీస్ లిమిటెడ్ ద్వారా డీ-మ్యాట్ అకౌంట్ ను ప్రారంభించామని చెప్పారు. లిస్టెడ్ కంపెనీల షేర్లను డొనేషన్లుగా ప్రస్తుతం అనుమతిస్తున్నామని, ఆ తర్వాత మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్, గోల్డ్ ఎక్స్ఛేంజ్ వంటి ట్రేడెడ్ ఫండ్స్ ద్వారా కూడా డొనేషన్లు తీసుకుంటామని చెప్పారు. భక్తులు డొనేషన్ల రూపంలో ఇవ్వాలనుకున్న షేర్లను ఆలయ డీ-మ్యాట్ అకౌంట్ కు నేరుగా ట్రాన్స్ ఫర్ చేయవచ్చని నరేంద్ర రాణే పేర్కొన్నారు.