: ఆరోగ్యం, అందంపై శ్రద్ధ పెట్టకపోతే అప్పుడే ముసలోళ్లమైపోయామనిపిస్తుంది: సినీ నటి రోజా
ఆరోగ్యం, అందంపై శ్రద్ధ పెట్టకపోతే అప్పుడే ముసలోళ్లమైపోయామనిపిస్తుందని ఎమ్మెల్యే, సినీ నటి రోజా అన్నారు. హైదరాబాద్ కొండాపూర్ లోని ‘గ్రీన్ ట్రెండ్స్’ అనే యుని సెక్స్ హెయిర్ అండ్ స్టైల్ సెలూన్ 34వ బ్రాంచ్ ను ఆమె ప్రారంభించారు. అనంతరం రోజా మాట్లాడుతూ, పొల్యూషన్ కారణంగా చర్మం, కేశాలు పాడవకుండా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోవాలని, అప్పుడు బ్యూటీపార్లర్ కు వెళ్లడం తప్పనిసరని అన్నారు. జాగ్రత్తలు పాటించకపోతే చిన్న వయసులోనే జుట్టు ఊడిపోయి బట్టతలలు వస్తాయని అన్నారు. ఆరోగ్యం, అందం కోసం ప్రతి ఒక్కరూ కొంచెం సమయం కేటాయిస్తే ఎక్కువ కాలంతో పాటు సంతోషంగా జీవించవచ్చన్నారు. ఆ విధంగా చేయకపోతే అప్పుడే ముసలోళ్లమైపోయామనే ఫీలింగ్ వచ్చి డిప్రెషన్ లోకి వెళ్లిపోతామని రోజా పేర్కొన్నారు.