: టీఆర్ఎస్, టీడీపీ ఎంపీలతో వెంకయ్యనాయుడు భేటీ
టీఆర్ఎస్, టీడీపీ ఎంపీలతో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సమావేశమయ్యారు. పార్లమెంటులో పలు బిల్లులు చర్చకు రానున్న క్రమంలో ఆయన తెలుగు రాష్ట్రాల అధికారపార్టీ ఎంపీలతో సమావేశమవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదాపై ఈ నెల 22 కాంగ్రెస్ నేత కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లు రాజ్యసభలో చర్చకు రానుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, వైఎస్సార్సీపీ ఆ బిల్లును బలపరిచేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి. అదే సమయంలో హైకోర్టు విభజన అంశం కూడా బీజేపీని ఇరకాటంలో పెట్టే అవకాశం ఉండడంతో దీనిపై ఎలా నడవాలన్న అంశలో అనుసరించాల్సిన విధానంపై ఈ రెండు పార్టీలతో వెంకయ్యనాయుడు చర్చించినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.