: అవును వాడు మావాడే...ఐఎస్ఐఎస్ ప్రకటన
అవును... జర్మనీలోని బెర్లిన్ లో ట్రూచిన్ జెన్ నుంచి వువర్జ్ బర్గ్ వెళ్తున్న ట్రైన్ లో గొడ్డలి, కత్తితో ప్రయాణికులపై దాడికి దిగిన యువకుడు తమవాడేనని ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ ప్రకటించింది. రెండేళ్ల క్రితం శరణార్థిగా జర్మనీకి వచ్చిన ఈ 17 ఏళ్ల యువకుడు ఇస్లామిక్ స్టేట్ సంస్థ ఫైటర్ అని ఆ ప్రకటనలో పేర్కొంది. ట్రైన్ దాడి ఘటనలో యువకుడి చేతిలో ఐదుగురు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. వివరాలు తెలుసుకున్న భద్రతాధికారులు వెంటనే స్పందించి, ముష్కరుడిని కాల్చి చంపారు. గతంలో బాంబుదాడులతో విరుచుకుపడిన ఉగ్రవాదులు, ఇప్పుడు అన్నెంపున్నెం ఎరుగని అమాయకులను పొట్టన పెట్టుకునేందుకు విభిన్న మార్గాల్లో దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే.