: ఈ వెసులుబాటే... పాక్ మోడల్ ఖండీల్ బలోచ్ హత్యకు కారణమట!


పాకిస్థాన్ సంచలన మోడల్ ఖండీల్ బలోచ్ హత్య సంచలనం రేపిన సంగతి తెలిసిందే. స్టార్ ఆటగాళ్లను, రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుకుని ఆమె సంధించే ట్వీట్లు ఆమెను సోషల్ మీడియా స్టార్ ను చేశాయి. అలాంటి స్టార్ హత్యకు పంజాబ్ ప్రావిన్స్ లో ఓ వెసులుబాటే కారణమని తెలుస్తోంది. పాకిస్థాన్ లో కుటుంబ సభ్యులను ఎవరైనా హత్య చేస్తే...ఇతర కుటుంబ సభ్యులు ఆ హత్యను సమర్థిస్తే...ఇక ఆ కేసులో శిక్ష పడదు. దీనిని వినియోగించుకునే ఖండీల్ బలోచ్ ను హత్య చేసేందుకు ఓ మత పెద్ద, బలోచ్ మాజీ భర్త హుస్సేన్ ... ఆమె సోదరుడు వసీంను ప్రోత్సహించారని తెలుస్తోంది. పంజాబ్ ప్రావిన్స్ లో ప్రముఖ ఇస్లాం మతగురువు అద్బుల్ ఖవి ఒడిలో ఖండీల్ బలోచ్ కూర్చొని సెల్ఫీ తీసుకుంది. ఈ ఫోటో తీసుకున్నప్పుడు ఖవి కూడా ఆనందించినట్టు స్పష్టంగా కనబడుతుంది. ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేయడంతో అతనిని మత గురువుగా తొలగిస్తూ ఫత్వా జారీ అయింది. ఫత్వాలే చట్టాలైన పాకిస్థాన్ లో ఈ ఫత్వా ఖవి మనసులో ఖండీల్ బలోచ్ పై కసి పెంచింది. దీంతో తన అనుచరుడైన మహ్మద్ వసీంను ఖవి రెచ్చగొట్టాడు. ఇతను మరోవైపు ఆమెకు తలాక్ చెప్పిన భర్తతో సత్సంబంధాలు కలిగి ఉండడం విశేషం. దీంతో వసీంను ఖవి రెచ్చగొట్టి ఆమెను చంపేలా ప్రోత్సహించాడు. ఆమెను చంపేసినా వసీంను కుటుంబం వదులుకోదని, క్షమిస్తుందని ఆయన సూచించడంతో ఈ హత్య చోటుచేసుకుంది. దీంతో పంజాబ్ పోలీసు అధికారులు నిందితుడిని క్షమించకూడదని ఆదేశాలు జారీ చేశారు. అయితే పోలీసు అధికారుల ఆదేశాలు కుటుంబం పాటిస్తుందా? అనేది సందేహమే!

  • Loading...

More Telugu News