: శుక్రవారం ఏపీ ప్రజలకు శుభవార్త వినిపిస్తుంది: దిగ్విజయ్ సింగ్


వచ్చే శుక్రవారం 22వ తేదీ నాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఓ శుభవార్త వినిపించనుందని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం పలుకుతుందని, అందుకు తగ్గ సభ్యుల మద్దతును సంపాదించామని ఆయన అన్నారు. బిల్లుపై కాంగ్రెస్ ఎంపీలకు విప్ జారీ చేస్తున్నామని, మరింత బలం కోసం గులాం నబీ ఆజాద్ పలు పార్టీలతో చర్చిస్తున్నారని అన్నారు. నేటి ఉదయం పలువురు కాంగ్రెస్ నేతలతో భేటీ అయిన ఆయన, అనంతరం మీడియాతో మాట్లాడారు. హోదా బిల్లు పాస్ అయి తీరుతుందన్న నమ్మకం రోజురోజుకూ పెరుగుతోందని వివరించారు. హోదా వస్తేనే రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళుతుందని తెలిపారు.

  • Loading...

More Telugu News