: అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ అంశాలపై ఖర్గే అనవసర ఆరోపణలు చేశారు: రాజ్నాథ్ ఆగ్రహం
అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ అంశాలపై కాంగ్రెస్ పార్టీ నేత, లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే అనవసర ఆరోపణలు చేశారని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు లోక్సభలో ఆయన మాట్లాడుతూ.. ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను భారతీయ జనతా పార్టీ అస్థిర పరచాలని చూస్తున్నట్లు ఖర్గే పలు వ్యాఖ్యలు చేశారని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికే కాంగ్రెస్ ఇలాంటి ఆరోపణలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. తమ ప్రభుత్వం అవినీతిరహితంగా పాలన కొనసాగిస్తోందని, అది చూసి జీర్ణించుకోలేకే కాంగ్రెస్ ఇలాంటి ఆరోపణలు చేస్తోందని ఆయన అన్నారు. దేశంలో ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం ఉందని ఆయన ఉద్ఘాటించారు.