: అప్ఘ‌నిస్థాన్‌లోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులంతా పాకిస్థాన్‌కు చెందిన వారేన‌ట‌!


తమ దేశంలో దాడులకి దిగుతోన్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులంతా పాకిస్థాన్‌కు చెందిన వారేన‌ని అప్ఘ‌నిస్థాన్‌ పేర్కొంది. ఉగ్ర‌వాదుల‌ ఏరివేత సందర్భంగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల స్థావ‌రాల్లో ప‌లు పత్రాలు ల‌భించాయ‌ని, వాటి ద్వారా ఆ ఉగ్ర‌వాదులంతా పాకిస్థాన్‌కు చెందిన వారుగా గుర్తించామ‌ని అధికారులు తెలిపారు. ఇస్లామిక్ స్టేట్‌లో చేరిన ఉగ్ర‌వాదుల్లో పాకిస్థాన్లోని ఒరగ్జాయ్ అనే గిరిజన ప్రాంతానికి చెందిన వారే అధికంగా ఉన్నార‌ని అక్కడి అధికారులు స్ప‌ష్టం చేశారు. అంతేగాక‌, అక్క‌డి స్థావ‌రాల‌ను విడిచి వెళ్లిన ఉగ్ర‌వాదుల్లో పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఆదేశాల ప్ర‌కార‌మే త‌మ చ‌ర్య‌లు కొన‌సాగిస్తున్నార‌ని అఫ్ఘ‌న్ అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News