: రెండోరోజు ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రెండోరోజు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే ఇటీవల వరదల్లోనూ, ఉగ్రదాడుల్లోను చనిపోయిన వారికి లోక్‌సభలో సభ్యులు సంతాపం తెలిపారు. అరుణాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తి ఊహించని పరిణామాలు చోటుచేసుకున్న అంశాలపై లోక్‌సభ, రాజ్యసభల్లో ఈరోజు ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉంది. కశ్మీర్లో చెలరేగిన హింసపై రాజ్యసభలో నిన్న ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు గళం విప్పిన సంగతి తెలిసిందే. ఈరోజు కూడా కశ్మీర్ అల్లర్లపై ప్రతిపక్షాలు కేంద్రాన్ని ఇరకాటంలో పెట్టే అవకాశం ఉంది.