: మా ఆయన చానా మంచోడు సుమీ..: మెలానియా ట్రంప్


తన భర్త, రిపబ్లికన్ల తరఫున అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ ను మెలానియా తెగ పొగిడేస్తున్నారు. అధ్యక్ష పదవికి ఎన్నికలు దగ్గరవుతున్న వేళ, వివిధ ర్యాలీల్లో పాల్గొంటూ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. తన భర్త చాలా మృదుస్వభావి అని, ప్రజలకు తెలిసిన దానికన్నా మంచి వ్యక్తని తెలిపారు. "ఆయన కఠినుడిగా కనిపించవచ్చు. అయినా, ఆయనలో జాలి, దయ, కరుణ కూడా వున్నాయి. అయితే ఇది అన్ని సమయాల్లో కనిపించకపోవచ్చు. ఒక్కో సమయంలో ఒక్కొక్కరికి కనిపిస్తుంది. ఈ కారణంతోనే నేను ఆయన ప్రేమలో పడ్డాను. ఈ స్వభావమే నన్ను ఆయనకు దగ్గర చేసింది" అని తెల్లని డ్రస్సులో మెరిసిపోతూ, క్లేవ్ ల్యాండ్ లో జరిగిన ప్రచారంలో ఆమె ప్రసంగించారు. తన భర్త చాలా మంచివ్యక్తని, అమెరికా అధ్యక్షుడిగా ప్రజలు ఎన్నుకుంటే, దేశం మరింత అభివృద్ధి చెందుతుందని, ఉగ్రవాద సమస్యను రూపుమాపగల సత్తా ఉన్న వ్యక్తని అభివర్ణించారు.

  • Loading...

More Telugu News