: 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మల్లన్న సేవలో చంద్రబాబు!
15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శ్రీశైల మల్లికార్జునుడిని దర్శించుకున్నారు. నిన్న కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్లిన చంద్రబాబు కృష్ణా పుష్కరాలకు సంబంధించిన పనులను పరిశీలించేందుకు శ్రీశైలం వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన శ్రీ భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్నారు. 2001 అక్టోబర్ లో ఉమ్మడి రాష్ట్ర సీఎం హోదాలో శ్రీశైలం వెళ్లిన చంద్రబాబు స్వామి వారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత చంద్రబాబు శ్రీశైలం వెళ్లలేదు. 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత నిన్న ఆయన మరోమారు శ్రీశైలేశుడిని దర్శించుకున్నారు. అయితే 15 ఏళ్ల తర్వాత వెళ్లినా... ఏపీ సీఎం హోదాలోనే ఆయన శ్రీశైలం వెళ్లడం గమనార్హం. మల్లన్న ఆలయానికి వచ్చిన చంద్రబాబుకు దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు, అధికారులు, వేద పండితులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.