: వెలగపూడికి నేడు చంద్రబాబు!... కృష్ణా నదిలో గోదావరి జలాలకు హారతి ఇవ్వనున్న ఏపీ సీఎం!
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నేడు మరోమారు నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి పరిధిలోని వెలగపూడిలో నిర్మితమవుతున్న తాత్కాలిక సచివాలయానికి వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి చేరుకున్న చంద్రబాబు నిన్న కర్నూలు జిల్లాలో పర్యటించారు. కర్నూలు కలెక్టరేట్ లో కృష్ణా పుష్కర పనులపై సమీక్ష అనంతరం శ్రీశైలం వెళ్లి పనులను పరిశీలించారు. ఆ తర్వాత విజయవాడ చేరుకున్న ఆయన ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా నదిలో కలిసిన గోదావరి జలాలకు హారతి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే వర్షం కారణంగా నిన్న హారతి కార్యక్రమం వాయిదా పడింది. దీంతో నేడు ఇబ్రహీంపట్నం వెళ్లనున్న చంద్రబాబు.... గోదావరి జలాలకు హారతి ఇవ్వనున్నారు. తదనంతరం ఆయన వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయానికి వెళతారు. అక్కడికి ఇప్పటికే తరలివెళ్లిన పలు శాఖల కార్యాలయాలను పరిశీలించడంతో పాటు ఇంకా కొనసాగుతున్న పనులను పర్యవేక్షిస్తారు.