: నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి అంతర్జాతీయ బిడ్లకు ఆహ్వానం... సీఆర్డీఏ ప్రకటన
స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి అంతర్జాతీయ బిడ్లకు సీఆర్డీఏ ఆహ్వానం పలికింది. ఈ మేరకు సీఆర్డీఏ ప్రకటన జారీ చేసింది. www.apeprocurement.gov.in లో బిడ్లకు సంబంధించిన దరఖాస్తులు ఉంటాయి. బిడ్ల దాఖలుకు సెప్టెంబరు 1వ తేదీ వరకు గడువుగా నిర్ణయించింది. సింగపూర్ కన్సార్టియం అందజేసిన ప్రతిపాదనపై అభ్యంతరాలకు గడువు ఆగస్టు 5 అని ఆ ప్రకటనలో పేర్కొంది. ఆగస్టు 8వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రీ బిడ్ కాన్ఫరెన్స్ జరుగుతుందని, అభ్యంతరాలపై ఆగస్టు 18వ తేదీన అథారిటీ స్పందించే అవకాశం ఉంటుందని పేర్కొంది. సెప్టెంబరు 6న రాజధాని అభివృద్ధిదారు ప్రకటన, కమర్షియల్ బిడ్ ఓపెనింగ్ ఆఖరు తేదీ సెప్టెంబర్ 8 అని, సెప్టెంబరు 19న అభివృద్ధిదారును ఖరారు చేస్తూ ఒప్పంద ప్రత్యేక పత్రం ఇచ్చే అవకాశాలు ఉంటాయని, ఈ బిడ్ కాలపరిమితి ఫిబ్రవరి 28, 2017 వరకు అని సీఆర్డీఏ ప్రకటనలో పేర్కొంది.