: వైజాగ్ అమ్మాయికి 'మిస్ పర్ఫెక్ట్ ఆంధ్రా' కిరీటం!


'మిస్ పర్ఫెక్ట్ ఆంధ్రా' కిరీటాన్ని వైజాగ్ కు చెందిన నిషా దక్కించుకోగా, మిస్టర్ పర్ఫెక్ట్ ఆంధ్రాగా పశ్చిమగోదావరి జిల్లా తణుకు యువకుడు మొల్విన్ నిలిచాడు. ఈ విషయాన్ని నిర్వాహకుడు బాలాజీ సింగ్ పేర్కొన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘మిస్, మిస్టర్ పర్ఫెక్ట్ ఇండియా’ పోటీల్లో భాగంగా రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ఈ పోటీల్లో మొత్తం పది విభాగాల్లో ఐదు రౌండ్ల పోటీని నిర్వహించి విజేతలను ఎంపికచేశామన్నారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచినవారు ‘మిస్, మిస్టర్ పర్ఫెక్టు ఇండియా’ పోటీలకు అర్హులని చెప్పారు. మిస్ పర్ఫెక్ట్ ఫ్రెష్ ఫేస్ గా రేష్మ, మిస్టర్ పర్ఫెక్ట్ ఫ్రెష్ ఫేస్ గా హేమేంద్ర, మిస్ పర్ఫెక్ట్ ర్యాంప్ వాక్ గా రేష్మ, మిస్టర్ పర్ఫెక్ట్ ర్యాంప్ వాక్ లో ప్రమోద్ నిలిచారని ఆయన తెలియజేశారు.

  • Loading...

More Telugu News