: రెట్టింపు కానున్న ఎంపీల జీతాలు!


ఎంపీల జీతాలు త్వరలో రెట్టింపు కానున్నాయి. జీతాల పెంపుపై ఎంపీల కమిటీ, మంత్రుల కమిటీ చేసిన సిఫార్సులను కేబినెట్ కు పంపారు. ఈ ప్రతిపాదనలను ప్రధాని నరేంద్ర మోదీ అంగీకరించాల్సి ఉంది. ఈ సిఫారసులు ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రధాని ముందుకు వచ్చే అవకాశముందని సమాచారం. పార్లమెంట్ ఆమోదం లభిస్తే కనుక ఎంపీలకు పెంచిన జీతాలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు సమాచారం. కొత్త వేతనాల ప్రకారం ఎంపీ నెల జీతం రూ.1 లక్షకు చేరుతుంది. నియోజకవర్గ అలవెన్స్ లు, ప్రయాణ, ఇతర అలవెన్స్ లు రూ.90 వేలకు చేరతాయి. ఎంపీల వార్షిక ఫర్నీచర్ అలవెన్స్ లు కూడా రెట్టింపు కానున్నాయి. అంతేకాకుండా, ఎంపీల సిబ్బంది జీతాలు, మాజీ ఎంపీల నెలవారీ పింఛన్ కూడా పెరగనుంది. మాజీ ఎంపీల పింఛన్ రూ.20 వేల నుంచి రూ.35 వేలకు పెరుగుతుందని తెలుస్తోంది. కొత్త జీతాలు అమల్లోకి వస్తే దాదాపు 800 మంది ప్రజాప్రతినిధుల మూలవేతనం రూ.50 వేల నుంచి లక్ష రూపాయలకు చేరుతుంది.

  • Loading...

More Telugu News