: కేసీఆర్ ఏం చేశారని తెలంగాణకు ఫస్ట్ ర్యాంక్ ఇస్తారు?: బీజేపీ అధికార ప్రతినిధి
తెలంగాణ రాష్ట్రానికి సీఎం కేసీఆర్ ఏం చేశారని చెప్పి ఫస్ట్ ర్యాంక్ ఇవ్వాలని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణా సాగర్ రావు ప్రశ్నించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేంద్రం రాష్ట్రాలపై సర్వే చేయలేదని, అటువంటప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఫస్ట్ ర్యాంక్ ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఇవన్నీ తప్పుడు వార్తలని, ఈ వార్తలపై ప్రధానికి ఫిర్యాదు చేశామని, దీనిపై సమాచార శాఖ విచారణ నిర్వహిస్తోందని కృష్ణా సాగర్ పేర్కొన్నారు.