: రాత్రిపూట నిద్రరాక హోటల్ గదిలో రాహుల్ ద్రావిడ్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసిన వేళ..!


మిస్టర్ డిపెండబుల్ గా భారత క్రికెట్ జట్టులో తనదైన ముద్రవేసి, ప్రస్తుతం జూనియర్ టీమ్ కు కోచ్ గా ఉన్న రాహుల్ ద్రావిడ్, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ ఆసక్తికర అంశాన్ని మీడియాతో పంచుకున్నాడు. ఒకసారి ఒంటరిగా హోటల్ రూములో ద్రావిడ్ ఉన్న వేళ, ఆయన గది నుంచి పెద్దపెద్ద శబ్దాలు వస్తున్నాయని, పక్క రూములోని వాళ్లు మేనేజ్ మెంటుకు ఫిర్యాదు చేశారట. పక్కనున్నది ద్రావిడ్ అని తెలియకుండానే వారు తమకు నిద్రాభంగం కలుగుతోందని కంప్లయింట్ ఇవ్వడంతో, హోటల్ అధికారులు అర్ధరాత్రి తన రూమ్ తలుపును తట్టారు. నిద్రపట్టక పోవడంతో బ్యాటింగ్ ప్రాక్టీసు చేస్తూ, తానుండిపోయానని, ఇలా పక్క రూములోని అతిథులు ఇబ్బంది పడుతున్నారని భావించలేదని వివరణ ఇచ్చానని ద్రావిడ్ వెల్లడించారు. దీంతో సమస్య సద్దుమణిగిందని, ఇటువంటి ఘటనలు తన జీవితంలో చాలానే ఉన్నాయని చెప్పాడు.

  • Loading...

More Telugu News