: న్యాయాధికారుల కేటాయింపు అంశంలో... కేంద్రం, తెలంగాణ, ఏపీకి సుప్రీంకోర్టు నోటీసులు
న్యాయాధికారుల కేటాయింపు అంశంలో సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై ధర్మాసనం ఈరోజు విచారణ చేపట్టింది. కేంద్రం అడ్వైజరీ కమిటీ ద్వారా న్యాయాధికారుల నియామకాలు చేపట్టాలని తెలంగాణ తరఫున న్యాయవాది అత్యున్నత న్యాయస్థానానికి విన్నవించారు. న్యాయాధికారుల నియామకాల అంశంలో న్యాయం చేస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ విషయంలో తమకు వివరణ ఇవ్వాలని కేంద్రం, తెలంగాణ, ఏపీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. న్యాయాధికారుల ప్రయోజనాలను కాపాడుతామని ధర్మాసనం తెలిపింది. అనంతరం పిటిషన్ల విచారణను 4 వారాలకు వాయిదా వేస్తున్నట్లు సుప్రీం తెలిపింది.