: శ్రీలంక ప్రధానితో కలిసి కీలక ఉపన్యాసం చేయనున్న కేటీఆర్
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావుకి శ్రీలంకలో ప్రసంగించాలని ఆహ్వానం అందింది. శ్రీలంక ప్రధాని విక్రమ సింఘేతో కలిసి కేటీఆర్ కీలక ఉపన్యాసం చేయనున్నారు. వచ్చేనెల 11, 12 తేదీల్లో జరగనున్న హ్యూమన్ క్యాపిటల్ సమ్మిట్‌లో మూడు కీలక అంశాలపై ఆయన ప్రసంగించనున్నారు. దేశ విధానాలు, శిక్షణ కార్యక్రమాలు, ఉద్యోగాలకు యువత సంసిద్ధం కావడం అన్న అంశాలపై కేటీఆర్ ప్రసంగిస్తారు. శ్రీలంక పంపిన ఆహ్వానం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో తమ ప్రభుత్వం చేపట్టిన శిక్షణ, నైపుణ్య కార్యక్రమాలను గురించి ప్రసంగిస్తానని కేటీఆర్ మీడియాకు తెలిపారు.