: యెమెన్‌లో కారుబాంబు దాడుల‌తో రెచ్చిపోయిన ఉగ్ర‌వాదులు


కార్లనిండా బాంబులతో వ‌చ్చిన‌ ఉగ్ర‌వాదులు దాడుల‌కు తెగ‌బ‌డి బీభ‌త్స వాతావ‌ర‌ణం సృష్టించిన ఘ‌ట‌న యెమెన్ లోని ముకల్లా నగరంలో చోటుచేసుకుంది. సైనిక శిబిరంలో కారు బాంబు దాడి చేసిన ఉగ్ర‌వాదులు అక్క‌డి ఐదుగురు సైనికుల ప్రాణాలు తీశారు. ఘ‌ట‌న‌లో మ‌రికొంత‌మంది గాయ‌ప‌డ‌గా, వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఉగ్ర‌వాదులు సైనిక శిబిరంలోనే కాక‌ మరో కారుతో నగరం నడిఒడ్డున కూడా రెచ్చిపోయారు. కారు బాంబు పేలుడు జ‌రిపి అక్క‌డ భ‌యాన‌క వాతావ‌ర‌ణాన్ని నెల‌కొల్పారు. దీనికి సంబంధించిన మ‌రింత స‌మాచారం అందాల్సి ఉంది. ఈ ప్రాంతంలో ఒక‌ప్పుడు అల్‌ఖైదా ఉగ్ర‌వాదుల ప్ర‌భావం ఎక్కువ‌గా ఉండేది. దాడులు జ‌రిపిన ఉగ్ర‌వాదులు ఏ ఉగ్ర సంస్థ‌కు చెందిన వారో ఇంకా తెలియ‌రాలేదు.

  • Loading...

More Telugu News