: ఒక్కొక్కరినీ పేరు పేరునా పరిచయం చేసిన నరేంద్ర మోదీ
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు కొద్దిసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. లోక్ సభ, రాజ్యసభల్లో కొత్తగా ఎన్నికైన ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమాలను సుమిత్రా మహాజన్, హమీద్ అన్సారీలు లాంఛనంగా జరిపించారు. ఆపై లోక్ సభలో కొత్తగా క్యాబినెట్ లో చేరిన మంత్రులను ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా సభకు పరిచయం చేశారు. తొలుత ఆయన క్యాబినెట్ లోకి ప్రమోషన్ ఇచ్చి మరీ తీసుకున్న ప్రకాశ్ జవదేకర్ ను పరిచయం చేశారు. అనుప్రియా పటేల్ సహా కొందరు మంత్రులను పరిచయం చేసే సమయంలో ఎంపీలు చప్పట్లతో అభినందించారు. ఆపై ఇటీవల మరణించిన ఎంపీలకు సభ సంతాపం తెలిపింది.