: మాట్లాడే అవకాశమే లేని సభాపతిని 'స్పీకర్' అని ఎందుకంటారో?: మధుసూదనాచారి డౌట్!
వరంగల్ లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారికి ఓ సందేహం వచ్చింది. వెంటనే దాన్ని బయటకు చెప్పి, దాని వెనకున్న విషయాన్ని బయటకు తీసి చెప్పాలని పాత్రికేయులకు సూచించారు. ఇంతకీ ఆయనకు వచ్చిన డౌట్ ఏంటో తెలుసా? అసెంబ్లీలో సభ్యులంతా మాట్లాడతారు, తమ సమస్యలను ఏకరవు పెడతారు. నియోజకవర్గంపై ప్రశ్నలేస్తారు. ఈ అవకాశమే లేని స్థానం సభాపతిది. సభను నియంత్రణలో ఉంచడం, సభకు సంబంధించిన విషయాలు మినహా, మరేమీ మాట్లాడటమన్నది ఉండదు. అలాంటి పదవికి 'స్పీకర్' అని పేరెందుకు పెట్టారు?... స్పీకర్ అని సభాపతిని ఎందుకు అంటారో తెలియదని, దీన్ని కనుక్కోవాలని ఆయన కోరారు.