: విచిత్రం... తెలంగాణలో జనాభా సంఖ్యను దాటిన సెల్ కనెక్షన్లు
జనాభాకన్నా సెల్ ఫోన్ కనెక్షన్ల సంఖ్య పెరిగిన విచిత్ర పరిస్థితి తెలంగాణలో నెలకొంది. సమాచార కమ్యూనికేషన్ల వ్యవస్థను విశ్లేషిస్తూ, రాష్ట్ర అర్థ గణాంక శాఖ తాజాగా విడుదల చేసిన రిపోర్టులో ఈ విషయం వెల్లడైంది. రాష్ట్రంలో 3.53 కోట్ల మంది జనాభా ఉండగా, సెల్ ఫోన్ కనెక్షన్ల సంఖ్య 3.66 కోట్లుగా ఉంది. మొత్తం 83,03,612 కోట్ల కుటుంబాలు నివసిస్తుండగా (2011 లెక్కలు), ప్రతి ఇంటికీ సగటున నాలుగు కనెక్షన్లు ఉన్నట్టు వెల్లడైంది. మొత్తం సెల్ ఫోన్ కనెక్షన్లలో మూడింట ఒక వంతు హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలోనే ఉన్నాయి. ల్యాండ్ ఫోన్లు 6.24 లక్షలకు పైగా ఉండగా, 1,314 టెలిఫోన్ ఎక్స్ఛేంజీల ద్వారా ఇవి పనిచేస్తున్నాయి. హైదరాబాద్ పబ్లిక్ టెలిఫోన్ బూత్ ల సంఖ్య 8,220కి తగ్గింది.