: కె.విశ్వనాథ్ గారి రుణం తీర్చుకోవడానికి నాకు ఈ జన్మ చాలదు: నటి తులసి


‘దర్శకుడు కె.విశ్వనాథ్ గారి రుణం తీర్చుకోవడానికి నాకు ఈ జన్మ సరిపోదు’ అని ప్రముఖ నటి తులసి అన్నారు. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ‘శంకరాభరణం’ అనే చిత్రానికి వరల్డ్ వైడ్ రేటింగ్ ఇచ్చారని, వరల్డ్ బెస్ట్ ఫిల్మ్స్ లో ఈ చిత్రం కూడా ఉందని తులసి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దర్శకులు బాపు, కె.విశ్వనాథ్, దాసరి నారాయణరావు దగ్గర పనిచేసినపుడు ఎన్నో విషయాలు నేర్చుకున్నానని అన్నారు. చిన్నతనంలోనే తాను నటనా రంగంలోకి రావడంతో మరింత చనువుతో దర్శకుల దగ్గర చాలా విషయాలు అడిగి తెలుసుకునేదానినని తులసి చెప్పారు.

  • Loading...

More Telugu News