: అమర్ నాథ్ యాత్రికులు నలుగురు మృతి
అమర్ నాథ్ యాత్రలో నలుగురు యాత్రికులు మృతి చెందారు. మార్గమధ్యంలో వారికి గుండెపోటు రావడంతో వారు ప్రాణాలు విడిచారు. జులై 2వ తేదీన ప్రారంభమైన ఈ యాత్రలో ఇప్పటి వరకు 15 మంది మృతి చెందినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. కాగా, తొమ్మిది రోజులుగా యాత్రలో ఇప్పటి వరకు మొత్తం 1.60 లక్షల మంది అమర్ నాథ్ లింగాన్ని దర్శించుకున్నారని పేర్కొన్నారు.